Land Grabbing | మునిపల్లి, సెప్టెంబర్ 06 : ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే వెంటనే స్పందించి చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారా..? సంబంధిత అధికారులు మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారా..? అంటే అవును అని చెప్పాలి.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేర చౌరస్తాలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ (90)లో అక్రమ కట్టడాలు , సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినట్టు గత పది రోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం పాఠకులకు తెలిసిందే.
నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించి రిపోర్ట్ అడగడంతో మునిపల్లి మండల రెవెన్యూ అధికారులు నామమాత్రంగా స్పందించి సర్వే సైతం చేయించి చేతులు ధూళిపేసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై కథనం వచ్చిన మరుసటి రోజు బుదేరా చౌరస్తలో సంబంధిత అధికారులతో సర్వేలు చేయడంలో చేసిన హడావిడి ఇప్పుడు ఏమైనట్లు అని స్థానికులు అధికారులు తీరుపై సహనం వ్యక్తం చేస్తున్నారు.
ముంబై జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిపై కొంతమంది ఎక్కువ అక్రమార్కులు రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వ భూమి కబ్జా చేసి దర్జాగా సిసి రోడ్ వేసి,మరి కొంతమంది బడా నాయకులు అండతో పెద్ద…పెద్ద బిల్డింగులు నిర్మించారు. ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజల నుంచి పలురకాల విమర్శలు మండలంలో గట్టిగ వినిపిస్తున్నాయి. జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి అవుతున్న తీసుకోవలసిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
తూతూ మంత్రంగా సర్వే
ముంబై జాతీయ రహదారికి మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది బడా వ్యాపారులు అక్రమ నిర్మాణాలు చేపట్టి సిసి రోడ్డు నిర్మాణం చేసిన అధికారులు మేము చూడలేం అన్నట్టు వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బతుకుదెరువు కోసం ప్రభుత్వం సర్కార్ భూమిని అందిస్తే అందినకాడికి సర్కార్ భూమి అని లెక్కచేయకుండా అమ్మకాలు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముంబై జాతీయ రహదారికి అతి సమీపంలో భూముల ధరలు కోట్లు పగలడంతో అక్రమార్కుల కన్ను బుధర ప్రభుత్వ భూమిపై పడింది భూమి అసైన్మెంట్ చేసిన పట్టదారులతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ భూమిని వారికి అనుకూలంగా మార్చి ఇండ్ల నిర్మాణాలు సిసి రోడ్లు నిర్మాణాలు చేపట్టారు.


రిపోర్ట్ పంపించాం: మునిపల్లి తహసీల్దార్ రంగారావు

సర్కార్ భూమి కబ్జాకు గురైనట్లు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేయించాం. సర్వే చేసి పూర్తి రిపోర్టు జిల్లా అధికారులకు పంపించాం. ప్రభుత్వ భూమిలో కట్టడాలు చేపట్టేవారు.. ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాం. సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు కట్టడం సరైనది కాదు నిర్మాణాలు చేసే వారు నిలిపి వేసుకోండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటం. సర్కార్ భూమి సర్వే (90)సర్వే నెంబర్ పూర్తిగా సర్వే చేయించడం జరిగింది. సర్కార్ భూమిలో అక్రమ కట్టడాలకి గతంలో అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారో మాకు తెలియదు. ప్రస్తుతం మేము బుదేరా ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేం. జిల్లా అధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!