SC Boys Hostel | నిజాంపేట్, జూలై 22 : ప్రభుత్వం వెనుకబడిన షెడ్యూల్ కులాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులు వసతి గృహాలకు వెళ్లడానికి దారి ఇబ్బందికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్‌లోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలతో నిండిపోవడం జరిగింది. దీనికి తోడు మురుగునీరు పారుతుండడంతో వసతి గృహ విద్యార్థులకు అటుగా వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది.
రాత్రివేళలో దారి పొడవునా గ్రామస్తులు బహిర్భూమికి పోవడంతో భోజన సమయంలో దుర్వాసన వెదజల్లుతుండడంతో భోజనం చేయలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు వసతిగృహం చుట్టూ అనేక పొదలతో నిండి ఉండడంతో దోమలు అధికంగా ఉన్నాయి. రాత్రి వేళలో కరెంటు పోయినప్పుడు దోమలు కుట్టడంతో విద్యార్థులు వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు అంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి వసతి గృహానికి వెళ్లే దారి బాగు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు లైసెన్సులు డిస్ప్లే చేయాలి: సుప్రీంకోర్టు
TTD key decisions | టీటీడీ కీలక నిర్ణయాలు.. సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Crime news | అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెక్కీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!