‘అల్లు అర్జున్‌తో కలిసి నటించడం నా డ్రీమ్. ఆయనతో చిన్న రోల్ అయినా చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు’ అంటున్నది ఢిల్లీ భామ రితికా నాయక్. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి, ‘మిరాయి’తో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’లోనూ, వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నది రితికా నాయక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. ఢిల్లీలోనే నా హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తయింది. ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకున్నా. కానీ ఫ్రెండ్స్ బలవంతం పెట్టడంతో తప్పక ‘ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ 12 సీజన్లో పాల్గొన్నా. ఊహించని విధంగా ఆ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచా.
అక్కడ్నుంచి నా ఆలోచనా విధానమే మారిపోయింది. ఎవరు ఆడిషన్స్‌కి పిలిచినా వెళ్లేదాన్ని. చివరికి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’తో హీరోయిన్గా మారాను. తొలి సినిమాకే బెస్ట్ డెబ్యూగా సైమా అవార్డు రావడంతో చెప్పలేనంత ఆనందం అనిపించింది. ఇక ‘మిరాయి’ నిజంగా నా లైఫ్‌లో ఓ మిరాకిలే. ఈ సినిమా పుణ్యమా అని హిందీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఏదేమైనా నా లైఫ్ యాంబిషన్ మాత్రం ఒకటే.. బన్నీతో కలిసి నటించాలి’ అని అందం గా నవ్వేసింది రితికా నాయక్.