జిన్నారం, ఆగస్టు 22 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య సూచించారు. శుక్రవారం గడ్డపోతారంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యూలాండ్ పరిశ్రమ సౌజన్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని ఆయా గ్రామాల్లో గల రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కమిషనర్ వెంకటరామయ్య మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు ప్రజలకు ఉపయోగపడే ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించటం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు, రోగులు పాల్గొన్నారు.