అందోల్, నవంబర్ 12 : రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులది.. తొండి.. మొండి వైఖరని, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడుతూ రైతులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన పంటలను కొంటారా.. కొనరా చెప్పకుండా డ్రామాలడుతూ కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ తీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జోగిపేట మార్కెట్ యార్డు ఎదుట రైతులతో కలిసి ఎమ్మెల్యే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ప్రజలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొంటామని స్పష్టమైన ఆదేశాలిస్తే, రాష్ట్రం ఎంత ధాన్యమైన కొనేందుకు సిద్ధంగా ఉన్నదని, ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ముం దుకు వచ్చి లేక ఇప్పించాలని సవాల్ విసిరారు. ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు ధాన్యం కంకులను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్, రజినీకాంత్, మాజీ చైర్మన్లు నాగభూషణం, నారాయణ, ఎంపీపీ బాల య్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, జడ్పీటీసీ రమేశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.