సదాశివపేట, మే 5 : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం ప్రారంభించారు. రైఫిల్ షూటింగ్, కిక్ బాక్సింగ్, షటిల్, బ్యాట్మింటన్, ఫుట్‌బాల్ తదితర క్రీడల సమ్మర్ క్యాంప్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఉచిత వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఉచిత వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కోచ్‌లను అభినందించారు.
అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బంగ్లా భారతి మాట్లాడుతూ విద్యార్థుల కోసం హాస్టల్స్‌ను నిర్మించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హాస్టల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్‌పాటిల్, సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజనేయులు, అవినాష్, సాయి, సత్యనారాయణ, షఫి, మహముద్, కోటి, ఆరిఫ్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.