ఇంటింటికీ శుద్ధ జలాలు
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష న్ భగీరథ పనులు సదాశివపేటలో పూర్తయ్యాయి. రూ. 44.47కోట్ల నిధులతో 130 కి.మీ ఇంట్రా పైపులైన్, ఎనిమిది ట్యాంకులను మున్సిపల్ అధికారులు నిర్మించారు.
- రూ. 44.47 కోట్ల నిధులతో పూర్తైన మిషన్ భగీరథ పనులు
- 130 కిలో మీటర్ల ఇంట్రా పైపులైన్
- మొత్తం ఎనిమిది ట్యాంకుల నిర్మాణం పూర్తి
- రోజుకు 6.5 ఎంఎల్డీ నీటి సరఫరా
- తీరిన పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు
సదాశివపేట, జనవరి 14: ఇంటింటికీ శుద్ధ జలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష న్ భగీరథ పనులు సదాశివపేటలో పూర్తయ్యాయి. రూ. 44.47కోట్ల నిధులతో 130 కి.మీ ఇంట్రా పైపులైన్, ఎనిమిది ట్యాంకులను మున్సిపల్ అధికారులు నిర్మించారు. పట్టణంలో 9,233 నల్లాల ద్వారా 6.5ఎంఎల్డీల నీటిని రోజుకు సరఫరా చేస్తున్నారు. గతంలో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేసేవారు. దీంతో పట్టణ వాసులకు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మిషన్ భగీరథ పనులు వందశాతం పూర్తి చేసి రోజూ నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
22 వార్డులో పైపులైన్..
మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పట్టణ వ్యాప్తంగా 130కి.మీటర్ల మేరా ఇంట్రా పైపులైన్ వేశారు. పట్టణంలో ని 26వార్డుల్లో పైపులైన్ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా పట్టణంలోని మొత్తం ఎనిమిది మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణాలు పూర్తయ్యాయి. సాయిబాబా మందిరం సమీపంలో ఒక ట్యాంకు, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 2ట్యాంకులు, కృష్ణానగర్, పీఎస్ఎంఎల్, రాచయ్యకాలనీ, గురునగర్ కాలనీ, శ్రీవిద్యానికేతన్ కాలనీల్లో ఒక్కొక్కటి చొప్పున ట్యాంకులను నిర్మించారు. ట్యాంకుల నిర్మాణాలు పూర్తయి వినియోగంలోకి వచ్చా యి. మొత్తం ఎనిమిది ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణ వ్యాప్తంగా ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా అవుతున్నాయి. బల్దియాలో మిషన్ భగీరత జలాలు ప్రతి రోజూ అందుతున్నాయి.
9,233 నల్లాల ద్వారా నీటి సరఫరా..
పట్టణంలోని 26వార్డుల్లో 9,233నల్లాలు ఉన్నాయి. పట్టణ వ్యాప్తంగా వందశాతం నల్లాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈ నల్లాల ద్వారా ప్రతి ఒక్కరికీ 135 లీట ర్లు చొప్పున ప్రతిరోజు 67.5లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో రెండు రోజులకోసారి నీటి సరఫరా జరిగేది. దీంతో పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కలిగేది. మిషన్ భగీరథ పథకం ద్వారా పూర్తి కాగా పట్టణ వ్యా ప్తంగా ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతోంది.
భగీరథ పనులు పూర్తి
పట్టణంలో మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తయ్యా యి. మొత్తం 8ట్యాంకుల ద్వా రా తాగునీటి సరఫరా జరుగుతున్నది. రోజుకు 6.5ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతున్నది. పైపులైన్ పనుల్లో లీకేజీల సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాం. భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఐదేండ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైపులైన్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా కాం ట్రాక్టర్దే బాధ్యత ఉంటుంది.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

