Old Woman | మునిపల్లి, మే 17; నా భర్త భూమి నా పేరు పైన చేపిస్తా అని మాయమాటలు చెప్పి నన్నూ మోసం చెసి నా పేరుఫై ఉన్న భూమిని తన పేరుఫై చేసుకున్న వ్యక్తిఫై తగు చర్యలు తీసుకోవాలంటూ ఓ వృద్ధురాలు అధికారులను వేడుకుంటుంది.. నా భూమి నాకు దక్కకపోతే నా భూమిలోనే ఆత్మహత్య చేసుకొని సచ్చిపోయాక నా భూమిలోనే ఏదో ఒక్కచోట నా భూమిలో నన్నూ సమాధి చేయండి సార్ అంటూ ఓ మహిళా వృద్ధురాలు కంటతడి పెట్టడం చూపరులచే కంటతడి పెట్టిస్తున్నప్పటికి… అధికారుల్లో మాత్రము ఎలాంటి కదలికలు లేకపోవడం గమనార్హం. అమ్మ నీకు నేనున్నాను.. నువ్వు ఒంటరి అని ఎప్పుడూ అనుకోకు అంటూ ఓ పెంపుడు కొడుకు తనను పెంచుకున్న తల్లి అమాయకురాలైన ఓ వృద్ధురాలిని అమ్మా… అమ్మా అని పిలిచి అమ్మ ఆస్థిఫై కన్నేసి కాజేశాడు.. తల్లి భూమిని మోసం చేసి సొంతం చేసుకొని పెంచుకున్న తల్లిని పుట్టెడు కష్టాల్లోకి నెట్టాడు.. పెంచుకున్న తల్లికి పెంపుడు కొడుకు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి పెంపుడు కొడుకు తీవ్ర నష్ట పరిచినట్లు ఇటీవల పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు నమ్మదగ్గ సమాచారం. బుసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడీల జనాభాయ్ అనే మహిళ భర్త గడీల రాములు గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పెంపుడు కొడుకు అసలు నాటకం మొదలు పెట్టాడు.. ఝరాసంగం మండలంలోని జొన్నగమ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ అనే పెంపుడు కొడుకు తన అమ్మ అని పిలిచే జనాభాయ్ భర్త పేరుఫై బుసరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న భూమిని భర్త గడీల జనాభాయ్ పేరుఫై ఉన్న 10-గుంటల భూమిని పౌతి చేపిస్తా అమ్మ అని చెప్పి… మండల కేంద్రమైన మునిపల్లి తహసీల్దార్ (sab రిజిస్టర్ )కార్యాలయనికి తీసుకువచ్చి మండలంలోని పెద్దచెల్మడ గ్రామ శివారులోని (165)సర్వే నంబర్లో గల 9.29గుంటల భూమికి పన్నం వేసి (జనాభాయ్)పేరు ఫై ఉన్న భూమిని పెంపుడు కొడుకు పేరుఫై చేసుకున్నాడు.
బుసరెడ్డిపల్లిలో 10గుంటల భూమిని జనాభాయ్ పేరు మీద చేపిచ్చి… పెద్ద చెల్మడ గ్రామంలోని 9.29గుంటల భూమిని పెంపుడు కొడుకు ఐన సంగమేశ్వర్ పేరు మీద చేసుకున్నాడు… అనంతరం వేరే వేరే పట్టాదారులకు అమ్ముకొని అమ్మ అని పిలిచే గడీల జనాభాయ్ బాగోగులు గాలికి వదిలేసాడు…
కేసున్నా రిజిస్ట్రేషన్స్ ఏలా చేస్తారు..?
మునిపల్లి మండలంలోని పెద్ద చెల్మడ గ్రామంలోని 165 సర్వే నెంబర్లో గల 9.29 గుంటల వ్యవసాయ భూమిఫై కేసు ఉన్నప్పటికీ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు.. అంటూ ఆ మహిళా మునిపల్లి రెవెన్యూ అధికారుల తీరుఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. కోర్టు ఆదేశాలు రెవెన్యూ అధికారులకు అక్కర్లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పెద్ద చెల్మడ గ్రామంలోని 165 సర్వే నంబర్లో గల 9.29గుంటల భూమిని సంబంధించి రిజిస్ట్రేషన్ల్లు నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలా అని బాధితురాలు కోరుతుంది.
ఫామ్ ల్యాండ్స్ ల అమ్మకాలు..
మండలంలోని పెద్ద చేల్మెడలో గల (165)సర్వే నెంబర్ లోని 9-29 గంటల భూమిని కొంతమంది రియల్ వ్యాపారులు ఫామ్ ల్యాండ్స్ గా మార్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. మోసం చెసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మంత్రి పేరు చేప్పుకొని అధికారులకు మేము ఉన్నాం అని మామూళ్లు అందజేసి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నట్లు సమాచారం.
నాడు ధైర్యం చెప్పి నేడు పట్టింపే లేదాయే..
నీకు మోసం చేసిన వారూ ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టను అని నాడు మాటలు చెప్పిన నేటి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు గడీల జనాభాయ్ అనే మహిళా వృద్ధురాలి సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
నాడు నీకు నేనున్నాను అని పబ్లిక్ లో చెప్పి.. నేడు కనీసం ఆమె సమస్యను తెలుసుకున్నది లేదు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.. దామోదర్ సార్ పట్టించుకుంటేనె నాకు న్యాయం జరుగుతుంది లేకపోతే నన్నూ ఎవ్వరూ పట్టించుకోరు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. కొంతమంది పెద్దమనుసులు ధైర్యంగా ఉండు నీకు మేము ఉన్నాం అని చెప్పి అందినకాడికి తీసుకోవడం ఆపై వృద్దరాలు అని చూడకుండా అసభ్యపజాలాలతో దూషించడం ఆశ్చర్యంగా ఉంది..



