పటాన్ చెరు, సెప్టెంబర్ 24 : యువ క్రీడాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొని రావాలని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్ రాష్ట్ర కమిటీ జట్టు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రసంగించారు. జిల్లాస్థాయిలో యువకులను క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు సంగారెడ్డి జిల్లా కబడి అసోసియేషన్ చైర్మన్ కుర్ర ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎంపికలు చేయడం అభినందనీయం అన్నారు.
వారం రోజులుగా జరిగిన కబడి సెలక్షన్ క్రీడాకారులకు క్రీడ దుస్తులను స్పాన్సర్ చేసిన నర్ర బిక్షపతిని, క్రీడాకారులకు భోజన వసతి కల్పించిన సంజీవరెడ్డిని అభినందించారు. క్రీడాకారులకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కబాడీ అసోసియేషన్ చైర్మన్ ఎల్లయ్య, సంజీవరెడ్డి, బిక్షపతి, గౌస్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పిఈటిలు పాల్గొన్నారు.