
ఆర్సీపురంలో రూ.5.1 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రామచంద్రాపురం, జూన్ 30: అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్ రూ.5.1 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ భూపాల్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ స్థానంలో నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
బల్దియాలో అభివృద్ధి పరుగులు..మేయర్ గద్వాల విజయలక్ష్మి
విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని జీహెచ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బల్దియా పరిధిలోని 150 డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు మున్సిపాల్ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పెద్దఎత్తున రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు ైఫ్లెఓవర్లు, అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం సేఫెస్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని, ప్రతిఒక్కరూ పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్-ఎమ్మెల్యే గూడెం మహిపాల్
పటాన్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఏడేండ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నా రు. బల్దియా పరిధిలోకి వచ్చే ఆర్సీపురం, భారతీనగర్, పటాన్ డివిజన్లు అభివృద్ధిలో నంబర్ నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతి డివిజన్ థీమ్ పార్కులను ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి కాలనీలో వందల కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ పుష్పానగేశ్ మాట్లాడుతూ ఆర్సీపురం డివిజన్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.5.1 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో భారతీనగర్, పటాన్ కార్పొరేటర్లు సింధూఆదర్శ్ మెట్టు కుమార్ డివిజన్ అధ్యక్షుడు పరమేశ్ మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఏఎంసీ డైరెక్టర్ ప్రమోద్ లక్ష్మణ్, సత్యనారాయణ, అబ్దుల్ కృష్ణమూర్తిచారి, ఐలేశ్, మల్లేశ్, రమేశ్, జీహెచ్ అధికారులు తదితరులున్నారు.