సంగారెడ్డి, ఏప్రిల్ 5: బాబూజగ్జీవన్‌రామ్ యువతకు స్ఫూర్తిదాయకమని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయన విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతిలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబూజగ్జీవన్‌రామ్ కులరహిత సమాజం, బడు గు బలహీన వర్గాల అభ్యన్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్య ఒక్కటే అన్నింటికి మార్గమమని, ప్రతిఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహించారని సేవలను గుర్తుచేశారు. వెనకబడిన తరగతుల వర్గాల అభ్యన్నతికి పాటు పడిన గొప్ప నాయకుడన్నారు. ఆయన ఆశయ సాధనకుయువత ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి : ఎస్పీ రమణ కుమార్
బాబూజగ్జీవన్‌రామ్ ఆశయాలతో అభివృద్ధికి బాటలు వేయాలని, అందుకోసం సహాయాన్ని అందించేందుకు ముందుకు రావాలని ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. పేదరికం నుంచి అందరినీ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురావాలన్నదే ఆయన ఆశయమన్నారు. పేదలకు తనవంతు చేయూనందించి అభివృద్ధికి పాటుపడాలని ఎస్పీ సూచించారు.
బాబు స్ఫూర్తిని కొనసాగించాలి : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
మాజీ ఉప ప్రధాని బాబూజగ్జీవన్‌రామ్ స్ఫూర్తిని ప్రజలు కొనసాగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలువాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. జగ్జీవన్‌రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేశ్‌రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీపీ లావణ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి, మాజీ సీడీసీ అధ్యక్షుడు శంకరీ విజయేందర్‌రెడ్డి, బీరయ్య యాదవ్, ఎంపీటీసీ నందకిషోర్, డాక్టరు శ్రీహరి, ప్రభుగౌడ్, నక్క నాగరాజుగౌడ్, ఎన్ఆర్ఐ షకీల్, జలేందర్‌రావు, హుస్సేన్, జిల్లా అధికారులు, విధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.