Ant Phobia | చీమల ఫోబియాతో వివాహిత ఆత్మహత్య
పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ (Ameenpur) మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. చీమల ఫోబియాతో (Ant Phobia) ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. శర్వా హోమ్స్‌కు చెందిన శ్రీకాంత్ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతున్నది.
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ (Ameenpur) మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. చీమల ఫోబియాతో (Ant Phobia) ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. శర్వా హోమ్స్‌కు చెందిన శ్రీకాంత్ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతున్నది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దవాఖానలో చూపించి, కౌన్సిలింగ్ ఇప్పించారు.
అయితే మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్కి తలుపు మూసి ఉన్నది. దీంతో స్థానికుల సహకారంతో దానిని తెరిచి, లోపలికి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు… కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చండి’ అని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

