గుమ్మడిదల,జూలై18: ఓ బాలికపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తికి ఐదేండ్లు కఠిన కారాగారశిక్ష, రూ.5వేలు జరిమానాను విధిస్తూ స్పెషల్ పోక్సోకోర్టు జడ్జి జయంతి తీర్పువెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం రాందాస్గూడకు చెందిన ఆకుల వీరేశం గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్నాడు. నవంబర్12, 2018న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓబాలిక ట్యూషన్‌కు వెళ్లి సాయంత్రం 7.30 గంటలకు ఇంటికి వస్తున్న క్రమంలో ఆ బాలికపై లైంగికదాడికి యత్నించాడని కుటుంబ సభ్యులు గుమ్మడిదలపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ఎస్సై రాజేశ్ నాయక్ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయగా కేసు పూర్వపరాలు విన్న స్పెషల్ పోక్సో కోర్టు జడ్చి జయంతి నిందితుడు ఆకుల వీరేశంకు ఐదేండ్లు కఠినకారాగార శిక్ష, రూ.ఐదు వేలు జరిమానాను విధిస్తూ తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పబ్లిక్‌ప్రాసిక్యూటర్ సూర్రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారి, ఎస్సై రాజేశ్‌నాయక్, ప్రస్తుత ఎస్సై భరత్‌భూషణ్, కోర్టు డ్యూటీ హెచ్‌సీ సురేశ్‌కుమార్, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్సీ శంకర్, కే.సత్యనారాయణలను ఎస్సీ అభినందించారు.