జిన్నారం, మే 04: జిన్నారం మండలం జంగంపేట గ్రామ వ్యవసాయ క్ష్రేతంలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారికి దాతలు ఆదివారం మకర తోరణాన్ని బహుకరించారు. మండలంలోని చౌదరి గూడెం గ్రామానికి చెందిన మద్దూరి మాధవి, మల్లారెడ్డి దంపతులు మకరం రూపంతో తయారు చేయించిన లోహ తోరణాన్ని ప్రధాన అర్చకులు శ్రీనివాస భార్గవ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిలో అమ్మవారి వెనకాల అలంకరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్య్రకమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
EAPCET | మౌస్ పనిచేస్తలేదని చెబితే.. నా బదులు వాళ్లే పరీక్ష రాశారు