సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం సంగారెడ్డి పట్టణం సాయి మాణిక్ నగర్లో గంజాయితో ముగ్గురు నిందితులు ఎక్సైజ్ అధికారులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు మెదక్ డివిజన్ అసిస్టింట్ కమినర్ రఘురామ్ వెల్లడించారు.
గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు సాయి మాణిక్‌నగర్‌లో దాడులు నిర్వహించారు. హోండా యునికాన్ బైక్‌లో సుమారు 1.2 కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో ప్యాకెట్లో 100 గ్రాముల చొప్పున 10 ప్యాకెట్లలో తరలిస్తున్నారు. ముగ్గురు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, మోటర్ బైక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.