MLA Koninty Manikrao | జహీరాబాద్, ఏప్రిల్ 22 : వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా కదిలి వచ్చి విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు.
ఇవాళ జహీరాబాద్ పట్టణంలో జహీరాబాద్ మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ మచ్చెందర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అమిత్ కుమార్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హీరు రాథోడ్, మైనార్టీ మండల అధ్యక్షుడు వహీద్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు చిన్న రెడ్డి, విజయ్, అబ్రహాం, మాజీ ఎంపీటీసీ లు బస్వరాజు, రాములు, శంకర్, గ్రామాల పార్టీ అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు