మునిపల్లి, జూన్ 13: మునిపల్లి మండలంలోని కంకోల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపడుతుండగా, ఇటీవలే హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అదేవిధంగా మండల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 108 వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే అంబులెన్స్‌ను సంబంధిత అధికారులు కంకోల్ హెల్త్ సబ్ సెంటర్ నుంచి రైకోడ్ సర్కార్ దవాఖానకు తరలించారు. దీంతో అధికారుల తిరుపై స్థానికులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
మండల ప్రజలకు 108 సేవలు సరిగ్గా అందడం లేదని, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. రాయికోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 వాహనాన్ని మళ్లీ కంకోల్ హెల్త్ సబ్ సెంటర్‌కు తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.