Hyper Tension Screening | సిర్గాపూర్, మే 17 : సంగారెడ్డి జిల్లాలో 30 ఏళ్లకు పైబడిన వారందరికి హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా. గాయత్రీదేవి అన్నారు. ఇవాళ సిర్గాపూర్ మండలాన్ని సందర్శించిన ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. అయితే జిల్లాలో 87,780 మంది హైపర్ టెన్షన్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
హైపర్ టెన్షన్ కలిగి ఉన్న వీరందరికి ఉచితంగా మందులు సరఫరా చేస్తూ చికిత్సలందిస్తున్నట్లు చెప్పారు. హైపర్ టెన్షన్ వల్ల గుండెపోటు, రక్తప్రసరణ నిలిచి పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకని జిల్లా వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక అవగాహన చేపట్టినట్లు చెప్పారు. హైపర్ టెన్షన్ ఉన్న వారు ఆహారంలో మార్పులు, వ్యాయామం తప్పనిసరి చేయాలన్నారు.
శరీరానికి తప్పకుండా శ్రమ అవసరమని, ఆహారం అలవాట్లను కూడా మార్చుకోవాలని సూచించారు. ఈమె వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సంధ్యారాణి, డా. నాగమణి, ఎంపీహెచ్ఏ భాస్కర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు