Lower grade EMployees | నిజాంపేట్, జులై 5 : కిందిస్థాయి ఉద్యోగులపై పై అధికారుల బెదిరింపులు అనాదిగా వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా 161 జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ అంబులెన్స్ వాహనాన్ని నడిపే వ్యక్తులపై ఆ శాఖ పై అధికారులు బెదిరింపులు జరుపుతున్నారు. సంగారెడ్డి నాందేడ్ అకోలా ప్రధాన 161 జాతీయ రహదారిలో సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ సమీపంలో ఉన్న ఆఫీస్ నందు చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఎమర్జెన్సీ వాహనంగా పిలవబడే అంబులెన్స్‌కు మూడు షిఫ్టులుగా విభజించి విధులు నిర్వహిస్తున్నారు.
ఇదివరకు ఇదంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం అంబులెన్స్‌ను తమ ఆఫీస్ ముందు ఉంచి ఆ షిఫ్ట్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులు అక్కడి నుండే బయలుదేరి ఎక్కడ సమస్య ఉన్నా తక్షణమే చేరుకొని విధులు నిర్వహించేవారు.. కానీ దానికి భిన్నంగా ప్రస్తుత యజమాన్యం అంబులెన్స్ వాహనానికి కాలే ఇంధనం డీజిల్ మిగులుబాటుగా చేసుకొని డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. అది ఇప్పుడు అంబులెన్స్ వాహనాన్ని వారు నిర్వహించే ఆఫీసుకు 15 నుండి 20 కిలోమీటర్ల దూరంలో నిలపాలని ఆంబులెన్స్ ఉద్యోగులకు ఆర్డర్లు వేస్తున్నారు.
రాత్రుల్లో భయభ్రాంతులకు గురవుతున్న స్త్రీలు..
ఎందుకంటే ఆంబులెన్స్ ఎటు వెళ్లిన 15 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుంది అందులో మిగతా 15 కిలోమీటర్ల ఇంధనం మిగులుబాటు చేసి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అన్ని సమయాలలో పురుషులతోపాటు స్త్రీలు కూడా అందులో ఉద్యోగిగా నర్సుగా పనిచేస్తున్నారు. షిఫ్ట్ వైస్ డ్యూటీ ఉండడంతో ఒకరికి ఒక్కొక్కసారి రాత్రిలో ఎక్కడో చోట ఉండాల్సి వస్తుంది. రాత్రుల్లో ఆ స్త్రీలు బహిర్భూమికి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వీరికి ఏదైనా అపాయం జరిగితే బాద్యులు ఎవరని అటుగా ప్రయాణిస్తున్న వాహన చోదకులు అంటున్నారు.
ఇదివరకు తమ ఆఫీస్ ముందే షిఫ్ట్ వైజ్ ఉన్నవారు రిలీవ్ అయి మరలా చార్జ్ తీసుకునేవారు అక్కడి నుండే ప్రారంభించేవారు కానీ ప్రస్తుతం ఎక్కడో ఓ చోట నిలపడంతో రాత్రి వేళలో మహిళ నర్సులకు ఇబ్బందికరంగా మారింది. ఇలా పనిచేయడం కాదు అనడంతో పై అధికారులు నచ్చితే చేయండి లేదా వెళ్లిపోండి అన్న రీతిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇది పై అధికారులు దృష్టి సారించి వెంటనే హైవే 161 జాతీయ రహదారిపై ఉన్న ప్రస్తుత అధికారులను తొలగించి సరియైన విధంగా విధులు నిర్వహించే అధికారులను నియమించి కిందిస్థాయి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించే విధంగా చూడాలని పలువురు ఆరోపిస్తున్నారు.
హాని జరిగితే బాధ్యులెవరు.. ?
రాత్రులలో మహిళ ఉద్యోగులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల హాని జరిగినచో ఎవరు బాధ్యులని పలువురు అంటున్నారు. అదే విధంగా ఇదివరకు హైవేపై కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులలో పలుచోట్ల ప్రయాణికులకు సేద తీరి మల మూత్ర విసర్జనల కొరకు సౌచాలయాలు నిర్మించినప్పటికీ వాటికి సంబంధించి సరియైన మెయింటెనెన్స్ చేయకుండా సొమ్మును దాచుకుంటున్నారు.
గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ నుండి మాసంపల్లి వరకు ఉన్న సౌచాలయాలకు తాళాలు వేయడంతో నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రశ్నించడంతో ప్రస్తుతం అవి తెరవబడ్డాయి. ఇలా అడిగే వారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తూ కిందిస్థాయి ఉద్యోగులపై మండిపడుతున్నారు. ఇక వారు చేసేది ఏమీ లేక భయభ్రాంతులకు గురై విధులు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటిది జరగకుండా పై అధికారులు దృష్టి సారించి వెంటనే సరైన రీతిలో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు