గుమ్మడిదల,మే2: అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి సర్కారు తక్షణ సాయమందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు వారం జిన్నారం, గుమ్మడిదల మండలాల వ్యాప్తం రాత్రి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో అకాల వర్షం కురిసి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించాయన్నారు. కూరగాయల పంటలు సైతం నష్టపోయి రైతుకు కడగండ్లేమిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయమందించాలని కోరారు. వ్యవసాయ అధికారులచే క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు కలిగిన నష్టానికి విపత్తుగా భావించి సాయమందించాలన్నారు. వీరితో పాటు జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్నపాపని కుమార్‌గౌడ్, ఆకుల ఆంజనేయులు, సూర్యనారాయణ, ఆంజనేయులు యాదవ్, ప్రభాకర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ.కృష్ణయాదవ్, ఆకుల బాబు, వినోద్ ఉన్నారు.