కల్హేర్, మే 4: మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజ చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఆలయంలో విగ్రహా ప్రతిష్ట, హోమం, ధ్వజస్తంభంతో పాటు నిత్యం పూజలు నిర్వహించారు. గౌడ సంఘం ఆహ్వానం మేరకు ఆలయానికి వచ్చి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రాంసింగ్, పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పండరి, నాయకులు నర్సింహగౌడ్, విఠల్, సాయిబాబా, సాయిరాం, విష్ణువర్ధన్‌రెడ్డి, పండరి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
EAPCET | మౌస్ పనిచేస్తలేదని చెబితే.. నా బదులు వాళ్లే పరీక్ష రాశారు