Nallavagu | సిర్గాపూర్, అక్టోబర్ 06 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం ధాటికి మండల పరిధిలోని నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద పోటేత్తింది. సోమవారం తెల్లవారుజామున వర్షం బీభత్సం సృష్టించింది. దాంతో సిర్గాపూర్ మండలంలోని వాగులు పెద్ద ఎత్తున్న పొంగి పొర్లుతున్నాయి.
దిగువకు నల్లవాగు ప్రాజెక్టులోకి చేరడంతో వరద ఉధృతికి డ్యాంలో ఒక్కసారిగా మూడు అడుగుల నీటి మట్టం పెరిగింది. ఎగువ నుంచి 28,002 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నదని ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. దాంతో అలుగు రెండు అడుగుల ఎత్తులో దిగువకు 27, 892 క్యూసెక్కులు ప్రవహించాయన్నారు.
ప్రాజెక్టు నీటి మట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1496.5 ఫీట్లకు చేరిందని, వరద మరింత పెరిగే అవకాశముందని ఏఈ తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తూ.. అలుగు పారుతుంది.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Gold Prices | బంగారం పరుగులు.. తులం రూ.1.23 లక్షలు