కోహీర్, జూన్6: కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం కోహీర్ పట్టణంలో ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పార్టీలకు అతీతంగా రైతుబంధు, రైతుబీమా, రూ.లక్ష వరకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయలేదని విమర్శించారు. రైతు భరోసా కూడా నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందలేదని అన్నారు. ఇంత వరకు రైతు బీమా ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించలేదని తెలిపారు. రైతులు చనిపోయినా బీమా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పథకాలు అందాయని వివరించారు. కానీ ఇప్పుడు మాత్రం పథకాలు వర్తించకపోవడంతో కార్యకర్తలు సొంత పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం తక్కువగా ఉందన్నారు.