సిర్గాపూర్, అక్టోబర్ 22 : గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి సాయిలు (58) మంగళవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించింది.
గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. పండుగ వేళ సాయిలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో సాయిలు సర్పంచ్‌గా, నల్లవాగు ఆయకట్టు చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నారు. సాయులు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.