న్యాల్కల్, జనవరి 4 : న్యాల్కల్, మిర్జాపూర్(బి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో కళాశాల, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కరోనా వాక్సిన్ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మంగళవారం ఆయా ఆరోగ్య కేంద్రాలతో పాటు హద్నూర్, మామిడ్గి, మిర్జాపూర్, రేజింతల్, మెటల్‌కుంట, మల్గి, తాట్పల్లి, అత్నూర్, అమీరాబాద్, రాఘవపూర్, మరియంపూర్ గ్రామాల్లో 15-18 సంవత్సరాల్లోపు టీనేజర్లకు వ్యాక్సిన్ వేశారు.
మునిపల్లి పీహెచ్సీలో
మునిపల్లి,జనవరి 4: గ్రామాల్లో 15-18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని మునిపల్లి డాక్టర్ శీరిష అన్నారు.మంగళవారం మునిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (15-18)ని ండిన యువతీ యువకులకు కరోనా టీకా ఇచ్చారు.
పుల్కల్ పీహెచ్సీలో
పుల్కల్, జనవరి 4 : పుల్కల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ టీసీ అవుసలి శ్రీనివాస్‌చారి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
రాయికోడ్‌లో
రాయికోడ్, జనవరి 4: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులకు గురికారని, మండలంలో కరోనా పరిస్థితి, చిక్సిత అందిస్తున్న తీరు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంగళవారం మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్‌గౌడ్ పలు విషయాలపై మాట్లాడారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే ఐసొలేట్ కావాలని, సదరు వ్యక్తికి కాంటాక్ట్‌లో ఉన్న వారు ఐదు రోజుల వరకు హోం ఐసొలేట్ అయి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు.
సిర్గాపూర్ జడ్పీహెచ్ఎస్లో
సిర్గాపూర్, జనవరి4 : సిర్గాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేశారు. కొవిడ్ నిబంధనలను పాటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విద్యార్థులను తీసుకెళ్లి వైద్య సిబ్బంది టీకాలను వేశారని హెచ్ఎం గురునాథ్, సీఆర్పీ శివకుమార్ తెలిపారు.