జహీరాబాద్, జనవరి 4 : జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగాల మేఘాల మీద జారీచేసిన ఓటరు జాబితా ముసాయిదాలో చాలావరకు తప్పులు దొర్లాయని సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ ఆరోపించారు. ఎన్నికల ముసాయిదా పక్రియలు తప్పుల తడాఖా ఉందని వాటిని సవరించాలని ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలో 37 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదాలు తప్పులు దొర్లాయని అన్నారు.
అధికారులు చేసిన తప్పిదం వల్ల వార్డుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. అధికారుల తప్పిదం వల్ల ఈరోజు వేరే వేరే నియోజకవర్గం అక్కడ మండలాల్లో నుండి ఓటర్లు జహీరాబాద్ పట్టణంలో విలీనం చేయడం సరి కాదన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు.