Couple Suicide | మునిపల్లి, జూన్ 03 : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు అనిత (32), రమేశ్ (38) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని పెద్దగోపులారం గ్రామంలోమంగళవారం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తన సిబ్బందితొ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనంతరం సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, కొండాపూర్ సీఐ వెంకటేష్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
దంపతుల ఆత్మహత్యతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. భార్యాభర్తల ఆత్మహత్యకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా