జహీరాబాద్, సెప్టెంబర్ 18 : గుండెపోటుతో పీజీ కళాశాలలో కాంట్రాక్ట్ వాచ్మెన్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం మిర్జాపూర్ బీఓయూ పీజీ కళాశాలలో చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ వాచ్మెన్ వైద్యనాథ్ (45) శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యాడు. ఛాతిలో నొప్పితో విలవిల్లాడిపోయిన వైద్యనాథ్ తోటి ఉద్యోగి శివకు చెప్పాడు.
వెంటనే అతడిని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రిన్సిపాల్ శివకుమార్ హామీ ఇచ్చారు.