ఝరాసంగం, మార్చి 10 : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా చేసిందేం లేదని, ఆరు గ్యారెంటీల పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా యువజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని పాండు తీవ్ర ఆరోపణలు చేశారు.
సోమవారం ఝరాసంగం మండల పరిధిలోని బర్ధిపూర్ గ్రామంలో స్థానిక కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీ స్కీంలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలు మాత్రం మరిచిపోయిందన్నారు.
అధికార పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం నడుపుతున్నారన్నారు. రైతు భరోసా రైతు భీమా కళ్యాణ లక్ష్మి , పింఛన్లు, రేషన్ కార్డులు ,సబ్సిడీ విత్తనాలు, యువతకు ఉద్యోగాల కల్పనలు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొరవడటం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు సాధించడంలో తీవ్రమైన అలసత్వం కనిపిస్తుందన్నారు.
పంచాయతీ కార్యవర్గం పాలన కాలముగీసి ఏడాది గడుస్తున్నా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. పంచాయతీ పాలకవర్గం లేక కేంద్రం నుంచి రావలసిన నిధులు రాక గ్రామాలలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపణ చేశారు. వెంటనే సర్పంచ్ ఎన్నికలు చేపట్టి గ్రామల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోట వెంకటేశం, హరీష్ పాటిల్,గోరఖ్నాథ్, రాజు,రమేష్,సంతు ,తదితరులు పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి