జహీరాబాద్ , ఏప్రిల్ 13 : గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చీకుర్తి గ్రామ సర్పంచ్ రమేష్ ఆధ్వ ర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల తో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగప డతాయని తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారులు బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు, దాతలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ , గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.