రాయికోడ్, ఆక్టోబర్ 3 : పత్తిచేనులో అంతరపంటగా సాగు చేస్తున్న నిషేధిత గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. రాయికోడ్ ఎస్ఐ ఏడుకోండలు తెలిపిన వివరాల ప్రకారం..పిప్పడపల్లి గ్రామంలో సిద్ధిరాం, గణపతిరావు అనే వ్యక్తులు పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు.
వారి పత్తి చేనులో సుమారు పది లక్షల విలువ చేసే గంజాయి పట్టుబడడంతో గంజాయి మొక్కలను ధ్వసం చేసినట్లు వివరించారు. స్థానిక నాయబ్ తహసీల్దార్ రాజు సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.