MLA Chinta Prabhakar | కొండాపూర్, మార్చి29 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పేదలకు అండగా ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎల్లారం ముత్తయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబానికి సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్త మరణిస్తే రూ. 2 లక్షల ప్రమాద భీమాను వారి కుటుంబానికి అందిస్తామన్నారు. ఆపదలో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి ప్రమాద భీమా దేశంలోనే ఏ పార్టీలకు కూడా లేదన్నారు.. అందుకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ప్రజల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడు తోడుగా ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, మాజీ సర్పంచ్‌లు సొసైటీ చైర్మన్ రాజు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌లు రఘునాథ్‌రెడ్డి. ఇంద్రారెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జలీల్, బీఆర్ఎస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.