పుల్కల్, జనవరి 11 : రాష్ట్రంలో ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై సీఐటీయూ జిల్లా నాయకుడు పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశవర్కర్లు చేసిన సేవలు అమోఘమన్నారు. ప్రభు త్వం వారి సేవలను గుర్తించి రూ.6,500 ఉన్న వేతనాన్ని రూ.9,750 పెంచడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో విమల, సరిత, సునీత, మమత, అనిత, జ్యోతి,అనూష పాల్గొన్నారు.
మునిపల్లిలో
వేతనాల పెంపుపై మండల ఆశవర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మునిపల్లిలో ఆశ వర్కర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల వేతనాలు పెరగడం సంతోషకరమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పలుమార్లు ఆశవర్కర్ల వేతనాలు పెరిగాయన్నారు. సమావేశంలో ఆయా గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.