BRS Party | కల్హేర్, ఏప్రిల్ 22 : బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి చెందుతుందనే భరోసాతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇవాళ నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సమక్షంలో పార్టీ నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
కల్హేర్ మండలం ఖానాపూర్ కే గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పెద్ద శంకరంపేట్ మండలం వీరోజీపల్లి గ్రామానికి చెందిన అమర్సేట్, కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రకాంత్‌లు పార్టీలో చేరారు. ఈ మేరకు భూపాల్‌రెడ్డి వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కల్హేర్ మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ సాగర్, భూమయ్యలు ఉన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు