గుమ్మడిదల, జూలై15: అలీ అబ్బాస్ జాతర వాల్ పోస్టర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు. గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ గ్రామంలో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు అలీ అబ్బాస్ జాతరను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అలీ అబ్బాస్ జాతర వాల్ పోస్టర్‌ను గుమ్మడిదల సీజీఆర్ట్రస్ట్ కార్యాలయంలో గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ దయానంద్, జాతర నిర్వాహకులతో కలిసి ఆయన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ మతాలకు అతీతంగా నిర్వహించుకునే అలీ అబ్బాస్ జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలని ప్రజలకు సూచించారు. వీరితో పాటు మద్దూరి లక్ష్మణ్, గొట్టిముక్కల రాజు, దొంతి కొమరేష్, దాసరి ఆంజనేయులు, చిరుమని శ్రీనివాస్, బీరప్ప, సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.