జహీరాబాద్, జనవరి 29 : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండురంగ పేర్కొన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
నామినేషన్ల స్వీకరణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంమబటల వరకు చేపట్టాలని, నామినేషన్ పత్రాల పరిశీలన, ఉప సంహరణ, అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపులలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి అంశంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు నామినేషన్‌పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోగా స్వీకరించాలని అధికారులకు సూచించారు.
అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్‌డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జహీరాబాద్ ఆర్డిఓ దేవుజ, ప్రత్యేక మున్సిపల్ కమిషనర్ జైతురాం, తాసిల్దార్ దశరథ్ తదితరులు ఉన్నారు