ఝరాసంగం, డిసెంబర్ 05 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శుక్రవారం ఉదయం దత్తాత్రేయ స్వామివారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఉదయం 11:20 నిమిషాలకు ప్రారంభమైన పల్లకి సేవ మధ్యాహ్నం 3 గంటల వరకు శోభాయాత్ర కొనసాగింది. బర్దిపూర్, పరిసరాలకు చెందిన మహిళా భక్తులు నిండు కలశములతో పల్లకి సేవకు స్వాగతం పలికారు. పల్లకి సేవకు దత్తాత్రేయ స్వామి వారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భజన సంకీర్తనలు,మంగళ వాయిద్యాల మధ్య సాగిన పల్లకి సేవ కార్యక్రమంలో కర్ణాటక చాంగులేర్ కు చెందిన కళాకారులు చేసిన దండకాలు, ఖడ్గాలు, భజన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్ణాటక బీదర్ కు చెందిన విద్యార్థులు నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్, గ్రామస్తులు ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్,బి, కృష్ణ ,కోట శ్రీనివాస్, దత్తు స్వామి, నాగన్న పాటిల్, కోట ఆశన్న, బోయిని ఎల్లన్న, వడ్ల సంగమేశ్వర్, న్యాల కాంటి దత్తు, తగు ఏర్పాట్లు చేశారు. వైదిక పాఠశాల విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.