పటాన్చెరు, డిసెంబర్ 24: పోచారం గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సర్పంచ్ జగన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ. 1.90లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. పోచారం నుంచి వ్యవసాయ పొలాలకు ఫార్మేషన్ రోడ్డు వేసేందుకు రూ. 1.50కోట్లు, రూ. 25లక్షలతో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 20లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం రూ. 1.95కోట్ల సీఎస్ఆర్ నిధులతో వీటిని చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులనుంచి స్ఫూర్తి పొంది తాను పోచారంలో పనులు చేపట్టానన్నారు.
ప్రణాళికాబద్ధంగా ప్రతి పంచాయతీకి నిధులను ఇచ్చి వారి ప్రగతిలో భాగస్వా మ్యం తీసుకుంటున్నామన్నారు. సీఎస్సార్ నిధులతోను అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. పోచారం గ్రామం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందాలని భారీగా నిధులను కేటాయిస్తామన్నారు. పోచారం సర్పంచ్ జగన్ మాట్లాడుతూ పోచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తన లక్ష్యం అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పోచారం ముందుకు పోతున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజ, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ మమత, భిక్షపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, తలారి భిక్షపతి, ఆంజనేయులు పాల్గొన్నారు.