
నర్సాపూర్,ఆగస్టు30: పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని చిప్పల్‌తుర్తిలోని కస్తూరా బాలికల పాఠశాలను అదనపు కలెక్టర్ రమేశ్ జిల్లా విద్యాధికారి రమేశ్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలను శానిటేషన్ చేయడం పూర్తి కావాలని సూచించారు. మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను, మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్‌బాబు, ఎంఈవో బుచ్చానాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలలను సందర్శించిన మున్సిపల్ చెర్మన్లు
ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, కమిషనర్ మోహన్ అన్నారు.సోమవారం మున్సిపల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పారిశుధ్య కార్మికులతో కలుపు మొక్కలు, గడ్డిని తొలిగింపజేశారు. అనంతరం చైర్మన్, కమిషనర్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండలాన్నారు. తరగతి గదులలో శానిటైజర్లు, మాస్క్‌లను ఉంచాలన్నారు.
రామాయంపేట మున్సిపల్లో..
రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గొల్పర్తి, కోమటిపల్లి, రామాయంపేట బాలికల పాఠశాలలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు.విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నా రు. రామాయంపేట మున్సిపల్ నుంచి శానిటైజర్లు తీసుకోవాలని సూచించా రు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు మ ల్యాల కవిత, సుందర్‌సింగ్, టీఆర్ఎస్ నాయకులు కిషన్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
చేగుంటలో..
పాఠశాల ఆవరణం ఎప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని నార్సింగి ఎంపీపీ సబిత, మండల ప్రత్యేక అధికారి జగదీశ్, ఎంపీడీవో ఆనంద్‌మేరీ తెలిపారు.నార్సింగి మండల పరిధిలోని జప్తిశివునూర్, సంకాపూర్, శేరిపల్లి పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులో శానిటేజేషన్ చేయించారు. విద్యార్థులకు ఏలా ంటి ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు, తాగునీటి సౌక ర్యం కల్పించాలన్నారు.కార్యక్రమంలో సర్పంచులు సుజాత, షేక్ షరీఫ్, మల్లేశం, పాఠశాలల హెచ్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిజాంపేటలో..
విద్య సంస్థలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని నిజాంపేట సర్పంచ్ అనూష అన్నారు. సోమవారం ఆమె నిజాంపేటలోని ఉన్నత పాఠశాల, బాలుర వసతి గృహం నందు పారిశుధ్య కార్మికులచే సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ఉన్నారు.