సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 5 : అన్నిమాసాల కంటే కార్తీక మాసం అతి పవిత్రమైనది. తెలుగు సంవత్సరంలో ఎనిమిదో నెల కార్తీక మాసాన్ని దామోదర మాసం అని అంటారు. ఈ మాసంలో శ్రీకృష్ణుడు దామోదర లీలలను చూపించాడు. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు. అందుకే ఈ నెల కార్తీక మాసం అం టారు. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువుల పూజ కోసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసం స్నానాలకు, వివిధ వ్రతములకు శుభప్రదం. కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏక భుక్తము, నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రి వేళ్లలో దేవాలయాల్లో, తులసి కట్ట వద్ద దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించడంతో గాలి తదితర వాటి వల్ల దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఉభయ పక్షంలో అనేక వ్రతాలు ఉన్నాయి. అయ్య ప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతున్నది.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తున్నది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడంతో ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిం ది. కార్తీక మాసానికి సమానమైన మాసం విష్ణుదేవుడి కంటే సమానమైన దేవుడు, వేదములకు సామానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రమైన తీర్థములు లేవన్నది పురాణం చెబుతున్నది. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివ కేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో తేశ నలుమూలల ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు కూడా వచ్చింది.
అభిషేక ప్రియః శివః శివుడికి అలంకారాలతో రాజోపచారాలు, ఐవేద్యాలతో పని లేదు. మనస్సులుతో భక్తిని ఉంచుకుని శివుడిని దానిస్తే చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు అని పండితులు చెబుతున్నారు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగజేస్తున్నది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, భూలోక బాధలు, శివుడిని శ్రీవృక్ష పత్రాలతో (బిల్వపత్రాలు) పూజించినట్లయితే స్వర్గంలో లక్ష సంవత్సరాలు జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషాకాలంలో పరమేశ్వరుడు ఏకాకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగంలో పార్వతి కుడి భాగంలో పరవమేశ్వర రూపంలో అర్ధ నారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోశ కాలంలో చెప్పబడిందని వేదపండితులు విశ్లేషిస్తున్నారు. ప్రదోశకాలంలో శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు అచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్త్ర లింగార్చన, ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.
తులసి దళాలతో మహావిష్ణువును కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్ర్తాలు చెబుతుతున్నది. ఈ మాసంలో విష్ఱువు దామోదర నామంతో పిలువబడుతాడు.
కార్తీక దామోదర ప్రీత్యర్థ్యం అని ఈ మాసంలో వ్రత దీక్ష ఆచరించాలి. తులసి దగ్గర హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్త్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయ డం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైనదని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తున్నదని శాస్తం చెబుతున్నది. కార్తీక పురాణం రోజుకో అధ్యా యం పారాయణం చేయడం శుభప్రదం. ఈ మాసం మొదటి నుంచి సూర్యోదయానికి ముందు నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉన్నది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తున్నది. ఈ మాసంలో గృహిణులు, యువతులు, ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుంచే ఆకాశదీపం ప్రారంభమవుతన్నది. ఉభయ సంధ్యలలో గృహంలో, పూజామందిరంలో, తులసి సన్నిధిలో, ఆలయాల్లో దీపారాధన ఇహ, పర సౌఖ్యాలను కలుగజేస్తాయని శాస్త్రం చెబుతున్నది. ఈ మాసం దీపారాధనకు ప్రశ్య స్త్యం. దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమం. మంచినూనె మధ్యమం. ఏకాదశి అత్యంత విశేషమైనది.
కార్తీక మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి
కార్తీక మాసంలో మహిళలు, యువతులు ఉదయాన్నే స్నానం ఆచరించి తులసి కోట వద్ద దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. ఈ మాసం దీపారాధనకు ప్రాశ్యస్త్యం. ప్రదోశకాలంలో (సూర్యాస్తమయానికి గంట ముందు గంట తర్వాత) శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లిం గార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు అచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.
-కందాడై వరదాచార్యులు, వైకుంఠపురం ప్రధాన అర్చకుడు, సంగారెడ్డి