ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.1.44 కోట్లతో నిర్మించిన నూతన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని సోమవారం మంత్రులు ప్రారంభించారు.
- మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ
- సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రారంభం
సంగారెడ్డి కలెక్టరేట్, మే 25 : ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో రూ.1.44 కోట్లతో నిర్మించిన నూతన జిల్లా అటవీ శాఖ కార్యాలయ భవనాన్ని సోమవారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరిత వనం పేరుతో రెండు ఆధునిక ఎకో పార్కులు అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. త్వరలో నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత సంతోష్, జిల్లా అటవీ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

