– జడ్జిలు సురేశ్, ఉమర్
– కోదాడ కోర్టులో క్రీడా పోటీలు ప్రారంభం
కోదాడ, ఆగస్టు 07 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోదాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నిత్యం అధిక పనిభారంతో మానసిక, శారీరక అలసటకు గురవుతుంటారన్నారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు వ్యాయామం లేదా ఏదైనా క్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన క్రీడ లేదా వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని న్యాయవాదులకు సూచించారు.
క్రీడలు పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు జట్టు స్ఫూర్తిని, మానసిక ప్రశాంతతను కూడా పెంచుతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహరావు, జనరల్ సెక్రటరీ రాంసిట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జాని పాషా, ఖజాంచి కోడూరు వెంకటేశ్వరులు, క్రీడల కార్యదర్శి వెంకటాచలం, లైబ్రరీ కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సీతారామరాజు, రంజాన్ పాషా, బొడ్డుపల్లి శ్రీనివాస్, పెద్దబ్బాయి, సీనియర్ న్యాయవాదులు వై.సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, సాధు శరత్ బాబు, సిల్వర్ వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, బి.గోవర్ధన్, ఈదుల కృష్ణయ్య, నర్సయ్యతో పాటు పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.