మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డి మాండ్ చేస్తూ సమగ్రశిక్షా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టా రు.
ఈ సందర్భంగా సమగ్రశిక్షా జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్లో వరంగల్లో సమగ్రశిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తు న్న సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో హాజరైన సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని, బేసిక్ పే అమలుచేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మా టను నిలబెట్టుకోవాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దీక్షలో సమగ్రశిక్షా ఉద్యోగులు రాజు, పాషా, సంపత్ తదితరులు పాల్గొన్నారు.