సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 24: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సం గారెడ్డి కలెక్టరేట్ ఏవో పరమేశ్‌కు వినతి ప త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..18 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈనెల 26న ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాలో జిల్లా నుంచి పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. 23 ఏండ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న సమగ్ర శిక్షా సిబ్బందికి కనీస వేతన చట్టం అమలు చేసి సేవలను క్రమబద్ధ్దీకరించాలని ప్రభుత్వాన్ని ఆయ న డిమాండ్ చేశారు. వారికి అన్నిరకాల సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసే పద్ధ్దతిని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
అంతకుముందు సమగ్ర శిక్షా ఉద్యోగులు సంగారెడ్డి పట్టణంలో బోనాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుములు రామచందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్యయాదవ్, రాష్ట్ర, జిల్లా నాయకులు సంజీవయ్య, కంరోద్దీన్, మల్లికార్జున్, శ్రీనివాస చారి, పుండరీకం, జనార్దన్, గోపాల్, సంతోష్, శివశంకర్, నర్సింహులు, మల్లేశం పాల్గొన్నారు.