Medak PACs | మెదక్ రూరల్, డిసెంబర్ 20 : మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చిలుముల హనుమంత రెడ్డితోపాటు డైరెక్టర్లు ఇప్పటి వరకు విధులు నిర్వహించారు.
శుక్రవారంతో మెదక్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ పదవి కాలం ముగియడంతో మెదక్ కో-ఆపరేటివ్ జిల్లా కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలు వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం (చైర్మన్)ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత రెడ్డికి, నూతన ఇంచార్జి బాధ్యతలు స్వీకరించిన సాయిలును సీఈవో సాయి, పెంటయ్య, సిబ్బంది శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమంత రెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా మెదక్ పీఏసీఎస్ కార్యాలయ అభివృద్ధి పథకంలో ప్రథమ స్థానం సాధించడంతోపాటు రైతులకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సహకార సంఘం కార్యకలాపాలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించారు.
రైతుల కోసం నిరంతరంకృషి చేయడంతోపాటు రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, సంతోష్, శ్రీనాథ్, మహేందర్, తదితరులు ఉన్నారు.

Sailu2
శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
Pilot Attack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా