సాగు కాలం వచ్చిందంటే రైతులకు దిగాలు ఉంటుండే. ఒకప్పడు పెట్టుబడికి సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు క్యూ కట్టేవారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగుచేస్తే చివరికి అప్పులే మిగిలేవి. గతంలో అప్పులు తీర్చలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు ఆ తిప్పలు తప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి కర్షకులను ఆదుకుంటున్నది. ఈనెల 26 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,18,542 మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు జమచేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.
సిద్దిపేట, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగు కాలం వచ్చిందంటే రైతులకు దిగాలు ఉంటుండే.. ఒకప్పడు పెట్టుబడికి సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు క్యూ కట్టేవారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగు చేస్తే చివరికి అప్పులే మిగిలేవి.గతంలో అప్పలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వారు. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు ఆ తిప్పలు తప్పాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టు బడిసాయాన్ని అందిస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు అందించి అన్నదాతకు ఈ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది. వానకాలం సాగుకు ఈనెల 26 నుంచి రైతు బంధును రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మ రం చేసింది. ఒక గుంట భూమి ఉన్న రైతును మొదలు కొని పట్టా భూమి ఉన్న ప్రతి రైతుకు, మొన్నటి వరకు భూములు కొనుగోలు చేసి పట్టా వచ్చిన వారికి సైతం రైతు బంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నది.రైతులు అడగకముందే పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో సాఫీగా సాగు చేసుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా సాగుకు ముందే వానకాలం రైతుబంధు డబ్బులు పడనున్నాయి. ఈసారి వర్షాలు ఆలస్యమయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వానకాలం
రైతుబంధు 10,18,542 మంది రైతులకు
రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుతున్నది. ఇప్పటి వరకు రైతులకు 10 సార్లు రైతు బంధు అమలు చేశారు. ప్రస్తుతం వేసే (వానకాలం-2023) రైతు బంధు 11వది. ప్రస్తుతం వానకాలం రైతుబంధు వేయడానికి రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 16 వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు వేయనున్నది. కొత్తగా పట్టా పాస్ పుస్తకం పొందిన రైతుల వివరాలు చూస్తే సిద్దిపేట జిల్లాలో 27,126 మంది, మెదక్ జిల్లాలో 23,432 మంది, సంగారెడ్డి జిల్లాలో 44,711 మంది ఉన్నారు.మొత్తంగా కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు ఉమ్మడి జిల్లాలో 95,269 మంది ఉన్నారు. ఈ వానకాలంలో సిద్దిపేట జిల్లాలో 3,39,289 మంది రైతులు, మెదక్ జిల్లాలో 2,74,815 మంది రైతులు, సంగారెడ్డి జిల్లాలో 4,04,438 మంది రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 10,18,542 మందికి రైతుబంధు వేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రేపటి నుంచి 11వ విడుత రైతుబంధు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు
సోమవారం నుంచి పదకొండవ విడత రైతు బంధు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో పడనున్నది. గత యాసంగి మాదిరిగానే ఒక ఎకరం నుంచి ప్రారంభమై రెండు ఎకరాలు, మూడు ఎకరాలు…ఇలా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలను అందించారు.గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తున్నారు.ప్రస్తుత వానకాలం పంటకు అందించే రైతు బంధు సాయం 11వది. కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న వారివి కూడా అప్డేట్ చేశారు. జూన్ 16లోపు కొత్తగా భూమి కొని పట్టాదారు పుస్తకం, లేదా ఆఫీసు కాఫీ వచ్చిన రైతులు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తుచేసుకోవచ్చు. వారందరివి కూడా వ్యవసాయశాఖ పోర్టల్ అప్లోడ్ చేశారు. రైతు బంధు డబ్బులను ఎరువులు, విత్తనాలు, దున్నకం తదితర వాటికి
పెట్టుబడికి రైతులు ఉపయోగిస్తున్నారు.
పది విడుతల్లో 76,66,001 మంది రైతులకు రూ.7,909.28 కోట్లు జమ ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొన్నటి యాసంగితో పది విడుతల్లో 76,66,001 మంది రైతులకు రూ. 7,909.28 కోట్లు రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 26,08,910 రైతులకు రూ. 2,796.02 కోట్లు, మెదక్ జిల్లాలో 22,09,531 మంది రైతులకు రూ. 1,832.55 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 28,47,560 మంది రైతులకు రూ. 3,280.71 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు.

Medak7

Medak8

Medak9