మెదక్ : మెదక్ జిల్లాలోని ర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్నది. నర్సాపూర్ ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు మూడవరోజు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా పలుసు కార్మిక సంఘాలు రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు కార్మికులు రాకుండా అడ్డుకుంటున్నారు.
దీంతో ఆర్టీసీ కార్మికులు మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్ ఆవరణలో సమ్మె కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.