రామాయంపేట, నవంబర్ 28: రామాయంపేట మున్సిపల్లోని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 9కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 3, 4, 5, 8, 9, 10, 11 వార్డులకు ఒక్కో వార్డులోని అభివృద్ధి సీసీ రోడ్లకు రూ. 25లక్షల చొప్పున రూ. 6కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. మిగి తా రూ. 3కోట్లను నాలుగు వార్డుల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధే ధ్యేయం గా పని చేస్తున్నారని అభివృద్ధి ఫలాలు పల్లెపల్లెకు అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. మునుపెన్నడు లేని విధం గా టీయూఐడీసీ నిధుల నుంచి రామాయంపేట పురపాలికను అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. కార్యక్రమంలో రా మాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్‌చైర్‌పర్సన్ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మ న్ బాదె చంద్రం, మాజీ ఎంపీటీసీలు సిద్ధిరాంరెడ్డి, కమిషనర్ యాదగిరి, మేనేజర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.
మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ ఇన్చార్జి సర్పంచ్‌గా గ్రామ వార్డు సభ్యురాలు కాసుల దుర్గమ్మను గ్రామస్తులు గ్రామ సభను నిర్వహించి వార్డు సభ్యుల సమక్షంలో ఇన్చార్జి స ర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యేను టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ దుర్గమ్మ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆమెను శాలువాతో సన్మానించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇది వరకు సర్పంచ్ ఉన్న దివంగత చాకలి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, మైసాగౌడ్ ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28: వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నిరుద్యోగ యువతి, యువకులకు ఓక వరం లాం టిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మూడు నెలల ఉచిత శిక్షణ పొందిన యువ తీ యువకులకు సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 27న ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ కేంద్రంలో తొలి బ్యాచ్ లో 141మంది టైలరింగ్, బ్యూటీషన్, సీసీ కెమెరా, మొబైల్ రిపేరింగ్ తదితర వృత్తి నైపుణ్యా రంగాల్లో మూడు నెలల శిక్ష ణ పొంది ఉత్తీర్ణులైన 81మంది ఈ రోజు సర్టిఫికెట్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
నిరుద్యోగులు ఉపాధి పొంది తమ జీవితాలను తీర్చిదిద్ధేందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతో దోహదపడుతున్నదన్నారు. కష్టపడే మనస్తత్వాన్నికి ఈ ఉచిత శిక్షణతో సొంతంగా నిలబడ్డవచ్చన్నారు. అంతకు ముందు జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు మాట్లాడుతూ శిక్షణ పొందిన వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారని వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి పొందేలా రుణ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. తప్పకుండా రుణ సౌక ర్యం కల్పిస్తానన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, వసంత్‌రాజ్, సమియొద్దీన్, పీఈటీలు మాదవరెడ్డి, శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, రాగి అశోక్, ఉమర్, శ్రీనివాస్, మల్లేశం ఉన్నారు.