Young India Integrated Gurukulam | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 10 : అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో మెదక్ నియోజక వర్గంలో నిర్మించే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు తెలిపారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కారదర్శి యెగితారాణా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమీకృత గురుకుల పాఠశాల 20 నుంచి 25 ఎకరాల స్థలంలో సకల సౌకర్యాలతో అన్ని హంగులతో నిర్మించడం జరుగుతుందన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో చదవలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసించడానికి వీలుంటుందన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి