దుబ్బాక, జనవరి 31: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర భాకర్‌రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో పలు రోడ్లకు రూ.10.51 కోట్లు మంజూరయ్యాయి. ని యోజకవర్గంలో మట్టి రోడ్లను బీటీగా మార్చేందు కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్డీఎఫ్ ద్వారా రూ. 40 కోట్లు మంజూరు కాగా, ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ నిధులను మంజూరు చేయాలని మంత్రి సీతక్కను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పలుసార్లు కోరారు.
దుబ్బాక నియోజకవర్గంలోని 5 రోడ్లను పంచాయతీరాజ్ శాఖ ద్వారా 28 కి.మీ మేర బీటీగా మార్చేందుకు రూ.10.51 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో దు బ్బాక మండలంలో మెదక్ పీడబ్ల్యూ రోడ్డు నుంచి ధర్మాజీపేట, రామక్కపేట చౌరస్తా వరకు రూ.2.24 కోట్లు, అక్బర్పేట-భూంపల్లి మండలంలోని చిట్టాపూర్, మోతె, కాసులాబాద్ రోడ్డుకు రూ.3.43 కోట్లు,వీరారెడ్డిపల్లి,జంగపల్లి,దౌల్తాబాద్ రోడ్డుకు రూ. కోటి, తొగుట మండలం తుక్కాపూర్ నుంచి కాన్గల్ వరకు రూ.1.66 కోట్లు, వరదరాజుపల్లి నుంచి మర్రికుంట రోడ్డుకు రూ.2.16 కోట్లు మం జూరైనట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా దుబ్బా క అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుపై నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.